హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెబుతున్న మహేశ్ బాబు కుమార్తె

  • ఫ్రోజెన్-2 చిత్రంలో సితార డబ్బింగ్
  • ఎల్సా చిన్నప్పటి పాత్రకు గొంతు అరువిస్తున్న సితార
  • నవంబరు 22న రిలీజ్ కానున్న ఫ్రోజెన్-2
టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయకుడు మహేశ్ బాబు కుమార్తె సితార ఓ హాలీవుడ్ సినిమా కోసం తన గొంతు అరువు ఇస్తోంది. సుప్రసిద్ధ వాల్ట్ డిస్నీ సంస్థ నుంచి వస్తున్న ఫ్రోజెన్-2 అనే చిత్రంలో ఎల్సా అనే పాత్రకు సితార డబ్బింగ్ చెబుతోంది. ఎల్సా చిన్నప్పటి పాత్రకు సితార గొంతుక ఇస్తోందని వాల్ట్ డిస్నీ ఇండియా విభాగం ప్రకటించింది. ఈ చిత్రం నవంబరు 22న రిలీజ్ అవుతోంది.

గతంలో వచ్చిన ఫ్రోజెన్ విజయవంతం కావడంతో దానికి సీక్వెల్ గా ఫ్రోజెన్-2 తెరకెక్కించారు. కాగా, ఎల్సా పెద్దయ్యాక పాత్రకు నటి నిత్యా మీనన్ డబ్బింగ్ చెబుతోంది. ఒకప్పుడు ఇంగ్లీషు చిత్రాలకు సాధారణ ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్పించేవాళ్లు. ఇటీవల కొంతకాలంగా ప్రముఖ సినీ నటులే హాలీవుడ్ సినిమా పాత్రలకు గొంతుక అరువిస్తున్నారు.
Go Back to Shorts
Hollywood
Sithara
Frozen-2
Walt Disney
Mahesh Babu

More Telugu News